భీమవరం: సభలు, జనసమీకరణకు మాత్రమే వివోఏలు గుర్తుకు వస్తారా అంటూ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా VOAలు నిరసన
మహిళలంటే గౌరవం అంటూ సాధికారత కోసం కృషి చేస్తున్నామంటూ పాలకులు చెప్పే మాటలు ఆచరణలో శూన్యంగా ఉన్నాయని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పివి ప్రతాప్ ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు వివోఏ లకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు. స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా వారికి రుణాలు అందించే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న వివోఏ లు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదని కేవలం సభలు జన సమీకరణ విషయంలోనే గుర్తుకు వస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.