మన్సురాబాద్ నుండి నాగోల్ డివిజన్ వరకు సాగుతున్న నాలా పునరుద్ధరణ పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కార్పొరేటర్ నరసింహారెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతుండటంతో పూడికను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. స్పందించిన హైడ్రా పూడిక పనులు ప్రారంభించిందన్నారు.