సంతనూతలపాడు: చీమకుర్తిలో దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా దుకాణాల వద్ద సందడి వాతావరణం, ధరలు ఎక్కువైనా కొనుగోలు చేసేందుకు ప్రజల మొగ్గు
చీమకుర్తి పట్టణంలో దీపావళి పండుగ సందర్భంగా బాన సంఖ్య దుకాణాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బాణసంచా కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులతో బాణసంచా దుకాణాలు కళకళలాడాయి. ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ బాణాసంచాను కొనుగోలు చేసేందుకు స్థానిక ప్రజలు మొగ్గు చూపారు. దుకాణాల వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక మరియు స్థానిక పోలీసులు గట్టి భద్రత చర్యలు చేపట్టారు.