ఒంగోలు అర్బన్: మహిళా ఆర్థిక స్వలంబన సాధికారత దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది : ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
Ongole Urban, Prakasam | Apr 17, 2026
మహిళా సాధికారతపై ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శుక్రవారం మీడియాకు వివరించారు. మెంప్మా ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ముందుకు వచ్చిన నలుగురు మహిళలకు ఒక్కొక్కరికి 50 వేల రూపాయల సహాయం అందించి చిన్నచిన్న వ్యాపారాలు ప్రారంభించేలా ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. గుడ్లు, బిర్యానీ, చికెన్ వంటి తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల వ్యాపారాలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా, ప్రభుత్వమే అవసరమైన సామగ్రి అందిస్తున్నదని స్పష్టం చేశారు.