వరంగల్: వరంగల్ కొత్తవాడలో ఘనంగా రావణవధ: పాల్గొన్న ఎమ్మెల్యే కొండా సురేఖ
వరంగల్ నగరంలోని కొత్తవాడలో విజయదశమి సందర్భంగా రావణవధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కొండా సురేఖ, రావణాసురుడి ప్రతిమను దహనం చేశారు. విద్యుత్ దీపాల వెలుగులు, టపాసుల మోతల నడుమ ఈ వేడుక కన్నుల పండుగగా సాగింది.