డోన్: జల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Apr 18, 2026 నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం డోన్ మండలం యాపదిన్నెలో గల చెరువుకు జల హారతి ఇచ్చారు. జల హారతి కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలు పెంపొందించడం, వర్షపు నీటిని నిల్వ చేయడం, చెరువులను సంరక్షించడం జరుగుతుందన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలను ఆయన కోరారు.