విపత్తులపై అప్రమత్తంగా ఉండాలి : బేతంచెర్ల ఎంపీడీవో పజూల్ రెహమాన్
Dhone, Nandyal | Apr 29, 2025 విపత్తులు జరిగినప్పుడు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా మీ వంతు కర్తవ్యంగా ప్రజలను అప్రమత్తం చేయాలని తహశీల్దార్ ప్రకాష్ బాబు, ఎంపీడీవో ఫజుల్ రహిమాన్ అన్నారు. మంగళవారం బేతంచెర్ల పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో విపత్తుల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు, విఆర్వోలు, గ్రామ సచివాలయ సిబ్బందికి మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అత్యవసర నంబర్లను గ్రామాల్లో అందుబాటులో ఉంచాలన్నారు.