ఒంగోలు అర్బన్: గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన: ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి
Ongole Urban, Prakasam | May 14, 2026
ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు బోర్డు వేలం నిర్వహణ కార్యాలయాన్ని గురువారం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మార్కాపురం వైసీపీ ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు సందర్శించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని నేతలు విమర్శలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వం కింటాకి రూ.22 వేలు ధర కల్పించిన విషయాన్ని వారు తెలిపారు.