ఆళ్లగడ్డ: పేరాయి పల్లె మెట్ట వద్ద రోడ్డు ప్రమాదంలో టిడిపి నాయకుడు మృతి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరాయి పల్లె మెట్ట వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చాగలమర్రి మండలం చిన్న వంగలికి చెందిన టిడిపి నాయకుడు నరేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు, నంద్యాల నుంచి చాగలమర్రి కి వెళ్తుండగా పేరాయి పల్లె సమీపంలోని హైవేపై ప్రమాదవశాత్తు డివైడర్ ను ఢీకొట్టడంతో నరేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.