గుంతకల్లు: క్రైస్తవ భక్తులతో కిక్కిరిసిపోయిన గుత్తి పట్టణంలోని బైబిల్ మిషన్ చర్చి (స్వస్థత శాల)
గుత్తిలోని లచ్చాన పల్లి రోడ్డు లో ఉన్న బైబిల్ మిషన్ చర్చి (స్వస్థతశాల) క్రైస్తవ భక్తులతో కిక్కిరిసిపోయింది. బైబిల్ మిషన్ చర్చిలో పాస్టర్ రెవరెండ్ అద్భుత కుమార్, మణి కుమారి ఆధ్వర్యంలో ఆదివారం ఈస్టర్ వేడుకలను అత్యంత ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాయలసీమలోని ఆయా ప్రాంతాలకు చెందిన క్రైస్తవులు భారీగా తరలివచ్చారు. చర్చి జనసంద్రంగా మారిపోయింది. పాస్టర్ అద్భుత కుమార్ ఈస్టర్ ప్రాధాన్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ ఏసు ప్రభువును ప్రార్థించాలన్నారు. ఏసుప్రభు పట్ల భక్తిని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉండాలన్నారు.