కర్నూలు: కర్నూలు నగరంలో అగ్ని ప్రమాదం వస్త్రా దుకాణం లో మంటలు
కర్నూల్ నగరంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నగరంలోని నెహ్రూ రోడ్డు తిరుమల సిల్క్స్ లో షాట్ సర్కిట్ ద్వారా మంటలు వ్యాపించాయి. దీంతో షాపులోని దుస్తులు శారీలు దగ్దం కావడం దుకాణంలోని అన్ని మంటలు వ్యాపించి పూర్తి గా మంటలో కాలి పోయాయి. దాదాపు ఈ ప్రమాదంలో 25 లక్షల రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.