డోన్: నంద్యాల జిల్లాలో జిల్లా మారిన మారని అధికారులు, కొన్నిచోట్ల ఇంకా కర్నూలు జిల్లా అనే బోర్డులపై పేరు
Dhone, Nandyal | Apr 21, 2026 డోన్లోని కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోర్డుపై ఇంకా కర్నూలు జిల్లాగానే ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఉమ్మడి జిల్లా విడిపోయి ఏళ్లు గడుస్తున్నా పేరు మార్చకపోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల రికార్డులు, బోర్డులపై నంద్యాల జిల్లాగా మార్పులు చేయాలని కోరుతున్నారు.