అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న మండలాల్లో శుక్రవారం మెగా పేరెంట్స్ డే కార్యక్రమాలను నిర్వహించారు. నియోజకవర్గంలోని ఉరవకొండ, కూడేరు, వజ్రకరూరు, విడపనకల్, బెళుగుప్ప మండల లోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో మెగా పేరెంట్స్ డే కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల ప్రతిభా పాటవాల మెరుగుకుపై మండల విద్యాశాఖ అధికారులు, హె చ్ ఎం లు, ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు సమీక్షించారు. పలు పాఠశాలల్లో విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.