బనగానపల్లె: రైతులకు రుణమాఫీ చేయాలి : బనగానపల్లెలో సిపిఐ నాయకులు డిమాండ్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని సీపీఐ బనగానపల్లె మండల కార్యదర్శి శివయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బనగానపల్లెలో రైతు మహాధర్నా వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ నెల 30న విజయవాడలో నిర్వహించే మహాధర్నాను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.