నగరంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగతో పాటు రిసీవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ సౌత్ వెస్ట్ జోన్, బోరబండ పోలీసులు కలిసి నిర్వహించిన ఆపరేషన్లో వీరిని పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.2.5 లక్షల విలువైన ఐదు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు నిందితుడు అంగీకరించాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.