ఒంగోలు అర్బన్: రాష్ట్రంలో ఏ రంగానికి చిన్న రైతు ఆనందంగా లేడని పూటకి ప్రభుత్వం అద్వానంగా ఉందని విమర్శించిన వైసిపి నేత వైవి సుబ్బారెడ్డి
Ongole Urban, Prakasam | May 15, 2026
రాష్ట్రంలో ఏ రంగానికి చెందిన రైతు ఆనందంగా లేడని వైసీపీ నేత మాజీ టిటిడి చైర్మన్ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అన్నారు. పొగాకు రైతులు మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు. ఆక్వా రైతులకు వ్యాపారులతో కలిసి రొయ్యల ఆహారం ధరలు విపరీతగా పెంచారని వైవి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలానే పాలన సాగితే రైతులు ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు.