తెనాలి: ఉల్లిపాలెం మండలంలోని కృష్ణ నది పరివాహక ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి మనోహర్
Tenali, Guntur | Sep 28, 2025 గుంటూరు జిల్లా కొలిపర మండలంలోని కృష్ణ నది పరివాహక ముంపు ప్రాంతాలలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఈరోజు సాయంత్రానికి 7 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలయ్యే అవకాశం ఉందని, ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించారు. నేటి ప్రవాహం 8 లక్షల క్యూసెక్కులకు పెరిగితే పంటలకు భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని, ఆ పరిస్థితి తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు.