నంద్యాల అర్బన్: పాణ్యం వద్ద డివైడర్ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్, తప్పిన పెను ప్రమాదం
Nandyal Urban, Nandyal | Jun 15, 2026
నంద్యాల జిల్లా పాణ్యం వద్ద ఇవాళ తెల్లవారుజామున పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నూలుమిల్లు వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న సుమారు 25 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు వేరే బస్సులో పంపించినట్లు పోలీసులు తెలిపారు.