అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం అంకంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు క్రీడా దుస్తులను గ్రామ సర్పంచ్ రుద్రానంద శనివారం వితరణ చేశారు. పాఠశాలలో హెచ్ఎం రాజశేఖర్ రెడ్డి తో కలిసి క్రీడల్లో రాణిస్తున్న 25 మంది విద్యార్థులకు క్రీడాదుస్తులను సర్పంచ్ అందజేశారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు వారి సొంతమని సర్పంచ్ సందర్భంగా పేర్కొన్నారు.