అన్నమయ్య జిల్లాలో రూ.1.50 కోట్ల విలువైన ఫోన్ల రికవరీ:జిల్లా ఎస్పీ ధీరజ్
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు మొత్తం 2,237 ఫోన్లు రికవరీ చేసినట్లు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా పోయిన ఫోన్లను తిరిగి యజమానులకు అందజేస్తున్నామని చెప్పారు. తాజా ఎనిమిదవ విడతలో భాగంగా 610 స్మార్ట్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, ఒక ట్యాబ్‌ను రికవరీ చేసినట్లు వివరించారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.1.50 కోట్లు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఫోన్లు కోల్పోయిన వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తద్వారా సులభంగా రికవరీ సాధ్యమవుతుందని సూచించారు.