నందికోట్కూరు: కర్నూలు 310 పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై కేసు విచారణకు హాజరు
రెండు వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా, దురుద్దేశపూర్వకంగా అవమానించడం వంటి వ్యాఖ్యల నేపథ్యంలో నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై BNS 351, 352, 356 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే మంగళవారం కర్నూలు 3 టౌన్ పిఎస్ కు విచారణ నిమిత్తం వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాజరయ్యారు, 41 నోటీస్ ఇచ్చారు విచారణ నిమిత్తం ఇక్కడికి వచ్చా ఆరోజు ధర్నాలో ఏం జరిగిందో వారికి వివరించానని వైసిపి నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీడియాతో అన్నారు