ఒంగోలు అర్బన్: కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం, అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jul 13, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం కలెక్టర్ రాజాబాబు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. వచ్చిన అర్జీలు అన్నిటిని పరిశీలించి పరిష్కరిస్తామని అర్చిదారులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. కొన్నిటిని తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి కలెక్టర్ పరిష్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకే ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.