రాష్ట్రంలో పర్యటించే అర్హత ప్రధాని నరేంద్ర మోడీకి లేదు : నెల్లూరులో సిఐటియు జిల్లా కార్యదర్శి అజయ్ ఫైర్
విభజన హామీలను నెరవేర్చని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని సిఐటియు నేత అజయ్ కుమార్ అన్నారు. ట్రంపు విపరీతంగా సుంకాలు విధిస్తే.. నోరు మెదపలేని స్థితిలో ప్రధాని ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పు, పప్పు, మిరపకాయ, చింతపండు వంటి వస్తువులలో జీఎస్టీ తగ్గుదల కనిపించడం లేదన్నారు. అవినీతి అక్రమాలు విపరీతంగా చేసి జీఎస్టీ తగ్గించామని చెప్పుకోవడం సిగ్గుచేటు అని నెల్లూరులో ఆయన వ్యాఖ్యానించారు.