అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం ఉపాధ్యాయుల క్రికెట్ (పురుషులకు), త్రో బాల్ (మహిళలకు) క్రీడా పోటీలను శనివారం ఎర్రగుడిలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా గుత్తి డివిజనల్ ఉప విద్యాశాఖాధికారి& MEO 1 మల్లారెడ్డి, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జునలతో కలిసి ప్రారంభించారు. ఉపాధ్యాయుల పోటీల్లో 60 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో MEO 2 హరికృష్ణ హెచ్ఎం వెంకట ప్రసాద్, స్థానిక టీడీపీ నాయకులు లక్ష్మీనారాయణ, ఎర్రిస్వామి ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.