బనగానపల్లె: బనగానపల్లెలో మెడికల్ షాప్ యజమానుల నిరసన
ఆన్లైన్ మందుల విక్రయాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మెడికల్ స్టోర్ అసోసియేషన్ సభ్యులు బనగానపల్లెలో బుధవారం షాపులు బంద్ చేసి, ర్యాలీ చేశారు. ఎమ్మార్వో మంజునాథ రెడ్డి, ఎస్సై దుగ్గిరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. నియంత్రణ లేని ఆన్లైన్ మందుల అమ్మకాల వల్ల ప్రజారోగ్యానికి ముప్పుతో పాటు చిన్న మెడికల్ షాపుల జీవనోపాధి దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు.