ప్రకాశం జిల్లా కలెక్టర్ చీమకుర్తి మండలం లో పర్యటిస్తూ మంచినీటి విషయంలో రాజీ పడేదే లేదంటూ స్థానికులని హెచ్చరించారు. బుధవారం చీమకుర్తి మండలం పాటిమీద పాలెం లో ఏర్పాటు చేసిన గ్రామసభలో మాట్లాడుతూ స్వచ్ఛమైన సురక్షితమైన మంచినీటి సరఫరా జరుగుతుందా లేదు అంటూ ఆరా తీశారు. ప్రస్తుత కాలంలో సీజనల్ వ్యాధులతో పాటు స్క్క్రప్ టైపస్ ప్రబులుతున్నాయని ఈ నేపథ్యంలో మంచినీటి విషయంలో రాజీపడమని హెచ్చరించారు మంచినీటి సరఫరా ట్యాంకులను పరిశీలిస్తూ స్థానిక ఎమ్మెల్యే తో కలిసి కాంట్రాక్టర్లకు తగిన సూచనలు ఇచ్చారు రేపటి నుండి స్వచ్ఛమైన నీరు ప్రజలకు అందకపోతే నేరుగా ఫోన్ చేసి అడగవచ్చని హామీ ఇచ్చారు