కడప: సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యం: జాయింట్ కలెక్టర్ అదితి సింగ్
Kadapa, YSR | Sep 25, 2025 జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యంగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పారదర్శకంగా, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్.. సంయుక్తంగా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో.. సాంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జేసీ అధితి సింగ్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ లతోపాటు డిఆర్వో విశ్వేశ్వర నాయుడు హాజరయ్యారు.