ఒంగోలు అర్బన్: యోగాసన సాధన నిత్య జీవితంలో భాగమయ్యేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 30, 2026
యోగాసన సాధన నిత్య జీవితంలో భాగమయ్యేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. ఈ దిశగా అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ యోగాసన కార్యక్రమాలను నిర్వహించేలా దృష్టి సారించాలని అధికారులను ఆయన ఆదేశించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 7వ తేదీ నుంచి 15 రోజులపాటు యోగ సాధన కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించిన నేపథ్యంలో శనివారం ప్రకాశం భవనంలోని తన చాంబర్లో సంబంధిత అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ దిశగా చేపట్టాల్సిన చర్యలపై వారికి దిశానిర్దేశం చేశారు.