అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజవర్గం మొలకలచెరువు మండల కేంద్రంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కన్వీనర్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ నాయకులు సిద్ధారెడ్డి, సదాశివప్ప ,వైస్ ఎంపీపీ మల్లికార్జున ,బూత్ కమిటీ అధ్యక్షుడు చాంద్ భాషా, సర్పంచ్ రామనాథం ,వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.