ఒంగోలు అర్బన్: పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | Apr 24, 2026
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు శుక్రవారం సాయంత్రం చీమకుర్తి మండలం చండ్రపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులు తోటి పలు అంశాలను గురించి చర్చించారు ప్రధానంగా గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గురించి వివరిస్తూ గ్రామస్తుల యొక్క పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలను వినియోగించుకునే విధానం అమలవుతున్న విధానం గురించి అడిగి తెలుసుకున్నారు సంక్షేమాన్ని అందరికీ అందే విధంగా చూడటమే అధికార యంత్రాంగం బాధ్యత అని తెలిపారు