భీమనపల్లిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్
పరిపాలన వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్య స్థాపన కోసం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఆవిర్భవించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. శనివారం భీమనపల్లి గ్రామంలో నరేగా నిధులైన రూ.23.94 లక్షల వ్యయంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో నిర్మించిన భీమనపల్లి రైతు భరోసా కేంద్రం-1ను మంత్రివర్యులు ప్రారంభించారు. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం నిధులైన రూ. 50 లక్షల అంచనా వ్యయంతో అదే గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్మించనున్న బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేసారు.