రైతు సాధికారత - గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల ఆధ్వర్యంలో అమలాపురంలో మహిళా సంఘాల సమావేశం
రైతు సాధికారత-గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల ఆధ్వర్యంలో అమలాపురం మండల సమాఖ్యలో మండల మహిళా సంఘాలకు సోమవారం వీడియో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ జూమ్ మీటింగ్లో అమరావతి నుంచి సెర్ఫ్ సీఈఓ మహ్మద్ ఇంతియాజ్, స్పెషల్ సీఎస్ రాజశేఖర్ సభ్యులతో మాట్లాడారు. ప్రతి సభ్యురాలు ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరూ ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేయడానికి కావల్సిన నీధి, స్త్రీ నీధి రూపంలో తీసుకుని చేయాలని సూచించారు.