కోడుమూరు: కోడుమూరులో బీసీ, ఎస్సీ బాలికల హాస్టల్లను తనిఖీచేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి
కోడుమూరు పట్టణంలోని బీసీ, ఎస్సీ బాలికల హాస్టల్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలికలతో కలెక్టర్ పలు విషయాలు ఆరా తీశారు. పాఠశాలలో బోధన, భోజనం, యూనిఫాం గురించి చర్చించారు. హాస్టల్లో మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా అంటూ అడిగి తెలుసుకున్నారు. చికెన్, గుడ్డు, స్నాక్స్ పై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు బాగా చదువుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ కోరారు.