నంద్యాల అర్బన్: నంద్యాలలో మద్యం మత్తులో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తల పగలగొట్టిన ఓ వ్యక్తి, పోలీసుల అదుపులో నిందితుడు
Nandyal Urban, Nandyal | May 31, 2026
నంద్యాల పట్టణంలోని శ్రీనివాస నగర్ లో ఉన్న వైయస్సార్ విగ్రహం తలాన్ని జంబులయ్య అనే వ్యక్తి మద్యం మత్తులో రాయి తీసుకొని తల పగలగొట్టాడు. ఈ విషయం అక్కడే ఉన్న కొందరు తమ సెల్ ఫోన్లు రికార్డ్ చేశారు. ప్రస్తుతం నంద్యాల పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనపై పోలీసుల స్పందించారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహం తలపగలగొట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు