కడప: కడప ప్రభుత్వ రిమ్స్ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
Kadapa, YSR | Oct 28, 2025 కడప రిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం తెల్లవారుజామున నుంచి పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ తమను విధుల్లోకి రావద్దన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన 20 ఏళ్లుగా లేని కొత్త నిబంధనలతో తమకు తీరని అన్యాయం చేస్తున్నారని, ఇది హేయమైన చర్య అని మండిపడ్డారు.