కోడుమూరు: బి తాండ్రపాడులో ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళాలో పాల్గొన్న ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని బి తాండ్రపాడు ఐటిఐ కళాశాలలో సోమవారం పీఎం నేషనల్ అప్రెంటిషిప్ మేళాలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యతోపాటు నైపుణ్యం ఎంత అవసరమన్నారు. ప్రభుత్వం యువతకు స్వయం ఉపాధి, పరిశ్రమలలో శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు.