అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ ఇటుకలపల్లి వద్ద ఉన్న శ్రీకృష్ణ ధరల విశ్వవిద్యాలయం బీఈడీ కళాశాలలో మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో బీఈడీ విద్యార్థినిలకు ఓరియంటేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రధాన ఆచార్యులు సోమశేఖర్ ఎడ్యుకేషనల్ బోర్డ్ ఆఫ్ స్టడీ చైర్మన్ ముని నారాయణప్ప తదితరులు మాట్లాడుతూ బీడీ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి అధ్యాపకులు చెప్పే పాఠాలు శ్రద్ధగా విని జరగబోయే డీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించి ఉత్తమ ఉపాధ్యాయునిగా సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని డాక్టర్ సోమశేఖర్ ముని నారాయణప్ప పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు రాజేశ్వరి అనిత పాల్గొన్నారు.