డోన్: బ్రేకులు ఫెయిల్ అయ్యి అమ్మకతాడు టోల్ ప్లాజా ను ఢీ కొట్టిన లారీ
Dhone, Nandyal | May 30, 2026 డోన్ జాతీయ రహదారిలోని అమకతాడు టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ఓ లారీ అకస్మాత్తుగా అదుపు తప్పి బ్రేకులు ఫెయిల్ కావడంతో టోల్ గేటులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో టోల్ ప్లాజాలో విధులు నిర్వహిస్తున్న ఓ సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు.