పలమనేరు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి, కాన్వాయ్ ఢీకొని మహిళలకు గాయాలయ్యాయని ఆరోపణలు
పలమనేరు: మండలం ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపు సమీపంలోని ఇందిరానగర్ స్థానికులు మీడియాకు తెలిపిన సమాచారం మేరకు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలిఫెంట్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం పర్యటన ముగించుకుని వెళ్తున్న తరుణంలో ఇందిరానగర్ వద్ద డిప్యూటీ సీఎంను చూడడానికి జనంలో నిలబడ్డ హేమలత అనే యువతిని పవన్ కాన్వాయ్ వాహనం తగిలి అదే సమయంలో సెక్యూరిటీ సిబ్బంది అక్కడ నిలుచున్న జనం తోపులాటలో కాలు విరిగిందని తెలిపారు. స్థానికులు సైతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువతీకి యాక్సిడెంట్ జరిగిన చూసి చూడకుండా వెళ్లిపోయారు అంటూ విమర్శించారు. ఈ ఘటనపై నిజా నిజాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.