చేగుంట: పొలంపల్లి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న లక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకీ వెంకటయ్య
Chegunta, Medak | Sep 19, 2025 చేగుంట మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన కొండి లక్ష్మి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరికి తెలిసిందే కొండి లక్ష్మి ఆత్మహత్యకు కారణమైన పంచాయతీ కార్యదర్శి స్రవంతి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కావడంతో పొలంపల్లి గ్రామానికి ఎస్సీ ఎస్టీ చైర్మన్ కమిషన్ బకీ వెంకటయ్య చేరుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ లక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి విచారించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు తమ పరిధిలో ఉద్యోగాలు చేసుకోవాలని స్వాతంత్రం వచ్చి 70 సం గడిచిన ఇప్పటికి ఎస్సీ ఎస్టీ వారిని చిన్నచూపు చూడడం చాలా బాధాకరమని ఆయన అన్నారు పంచాయతీ కార్యదర్శి స్రవంతిని సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలన్నారు