గుంతకల్లు: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై వెంటనే కేసు నమోదు చేయాలని గుంతకల్లులో వైసీపీ శ్రేణులు డీఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై వెంటనే కేసు నమోదు చేయాలని గుంతకల్లులో వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. గుంతకల్లు డీఎస్పీ కార్యాలయం వద్ద గురువారం వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. మహిళలను కించపరుస్తూ తన చానల్లో ప్రచారం చేసిన రాధాకృష్ణ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేయడంతో పాటు అరెస్టు చేసి శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.