జహీరాబాద్: పస్తాపూర్ చౌరస్తా వద్ద ఆటో బోల్తా, ఇరువురికి గాయాలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని పస్తాపూర్ ఎక్స్ రోడ్ వద్ద ఆటో బోల్తా కొట్టిన సంఘటన చోటుచేసుకుంది. గురువారం కోహిరు మండలం పీచ రాగడి గ్రామం నుండి జహీరాబాద్ వస్తున్న ఆటో వస్తాపూర్ చౌరస్తా వద్ద వెనుక నుండి మరో వాహనం ఢీకొట్టడంతో బోల్తా కొట్టింది. దీంతో ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణిస్తున్న పీచే రాగడి గ్రామానికి చెందిన శ్రీనివాస్, రవి గాయపడ్డారు. వారిని వెంటనే స్థానికులు జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.