బనగానపల్లె: బనగానపల్లె మండలంలో ఆదివారం విద్యుత్ సరఫరా లో అంతరాయం
బనగానపల్లె మండలంలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ మద్దిలేటి శనివారం తెలిపారు. కొత్తగా జరుగుతున్న 33 కేవీ లైన్ పనుల కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కైప సబ్ స్టేషన్ పరిధిలో ఉండే అప్పలాపురం, టంగుటూరు గ్రామాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.