ఒంగోలు అర్బన్: నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ‘ఆపరేషన్ వజ్రప్రహార్’
Ongole Urban, Prakasam | Jun 7, 2026
మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు డి.ఎస్.పి ఆర్. శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఒంగోలు వన్ టౌన్ సిఐ కె.వెంకటేశ్వరరావు, ఒంగోలు టు టౌన్ ఎస్ఐ యు.పున్నారావు మరియు , తాలూకా ఎస్సైలు మొత్తం 40 మంది పోలీస్ సిబ్బంది ఒంగోలు టూ టౌన్ పియస్ పరిధిలోని బాలాజీ నగర్, బత్తులవారి గుంట మరియు పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం ‘ఆపరేషన్ వజ్రా ప్రహార్’లో భాగంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీలలో భాగంగా గంజాయి వంటి మారకద్రవ్యాల పై నిగా పెట్టారు