పుంగనూరు: చౌడేపల్లి మండలంలో ఎమ్మెల్యే పర్యటనను జయప్రదం చేయాలి. చౌడేపల్లి మండల అధ్యక్షులు నాగభూషణం రెడ్డి.
చిత్తూరు జిల్లా నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో రాష్ట్ర మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనెల 10న సోమవారం పర్యటించనున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రకటనలో తెలిపారు. ఏ. కొత్తకోట, చారాల, దుర్గ సముద్రం ,చౌడేపల్లి, చింతమాకులపల్లి, పుద్ధిపట్ల, పెద్ద ఎల్లకుంట్ల ,వెంగళపల్లి దిగువపల్లి పంచాయతీ గ్రామాల్లో పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొంటారని వైసీపీ నాయకులు ప్రజలు కార్యక్రమాల్లో కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.