శ్రీశైలంలో అక్రమంగా నిలువ ఉంచిన 97 మద్యం బాటిల్ స్వాధీనం .ఒకరు అరెస్ట్
శ్రీశైలంలో కూలీ పనులు చేసుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తి వద్ద 97 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని, అతడిని అరెస్టు చేసినట్లు CI ప్రసాదరావు తెలిపారు. తెలంగాణకు చెందిన చెన్నయ్య సంచిలో 97 క్వాటర్ బాటిళ్లను కలిగి ఉండటంతో పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నట్టు పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది రాజేంద్ర కుమార్, అమర్నాథ్ రెడ్డి, వెంకట్ నారాయణ ఉన్నారు.. శ్రీశైలంలో వరుసగా మద్యం పట్టుబడుతున్నడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన పుణ్యస్థలానికి మద్యం ఎలా వస్తుందని, పోలీసులు మెగా పెంచి మద్యం రాకుండా చూడాలని కోరుతున్నారు.