నంద్యాల అర్బన్: నంద్యాలలో శానిటేషన్ పనులు వేగవంతం చేయండి : కమిషనర్ బండి శేషన్న
Nandyal Urban, Nandyal | Jun 3, 2026
నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న బుధవారం పలు వార్డుల్లో శానిటేషన్ పనులను పరిశీలించారు. పూడిక తొలగింపు, చెత్త తొలగింపు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి నిషేధిత ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని అన్న క్యాంటీన్ను సందర్శించి ఆహార నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు