మాచారెడ్డి: కేంద్రం వైఫల్యం వల్లనే యూరియా కొరత : జిల్లా కిసాన్ విభాగం సీనియర్ నాయకుడు ఇటిక్యాల సురేందర్ రెడ్డి
మాచారెడ్డి : కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని కాంగ్రెస్ జిల్లా కిసాన్ విభాగం సీనియర్ నాయకుడు ఇటిక్యాల సురేందర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో త ఆయన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో మీడియాతో మాట్లాడారు.. రైతులకు సరిపోయే యూరియాను ప్రభుత్వం సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.