నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో సోమవారం స్వాతి నక్షత్ర వేడుకలువేదపండితులు ఘనంగా నిర్వహించారు. దిగువ అహోబిలంలో ఆలయ ప్రధాన అర్చకులు వేణు గోపాలన్ తమ బృందంతో సుదర్శన హోమం నిర్వహించారు. ఉత్సవ మూర్తులు శ్రీ ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.