నంద్యాల అర్బన్: నంద్యాలలో విషాదం, డ్రైనేజీ కాలువలో పడి ఓ వ్యక్తి మృతి
Nandyal Urban, Nandyal | May 22, 2026
నంద్యాలలో డ్రైనేజీ కాలువలో వ్యక్తి పడి మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం నంద్యాల మండలం బిళ్లలాపురం గ్రామానికి చెందిన రంగయ్య ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉన్న కల్వర్టుపైన కూర్చొని ఉండగా ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.